హోటల్స్‌లో అధికారులు ఆకస్మిక తనిఖీ
SDPT: పట్టణంలోని పలు హోటళ్లపై సివిల్ సప్లై, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దాడులలో 14 హోటళ్లలో 24 డొమెస్టిక్ సిలిండర్లు సీజ్ చేసినట్లు జిల్లా సివిల్ సప్లై అధికారి తనూజ తెలిపారు. అక్రమంగా వాడుతున్న సిలిండర్లపై కేసులు నమోదు చేసి, హోటళ్లకు, దాబాలకు డొమెస్టిక్ సిలిండర్లు సరఫరా చేస్తే గ్యాస్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.