VIDEO: కూలీగా మారిన మంత్రి నిమ్మల

VIDEO: కూలీగా మారిన మంత్రి నిమ్మల

AP: మంత్రి నిమ్మల రామానాయుడు భవన నిర్మాణ కూలీగా మారారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రూ.3 కోట్లతో నిర్మిస్తున్న గౌడ, శెట్టిబలిజ కల్యాణ మండపం నిర్మాణ పనుల్లో ఆయన శ్రమదానం చేశారు. కార్మికులతో కలిసి మంత్రి సైతం కంకర, ఇసుక, సిమెంట్‌ను తట్టల్లో మోసుకెళ్లి మిక్సర్‌లో వేశారు. మంత్రి తమతో కలిసి పనిచేయడం చూసి కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.