పాలేరు నియోజకవర్గంలో 3 పంచాయతీలు ఏకీగ్రీవం
BDK: పాలేరు నియోజకవర్గంలోని మొత్తం 134గ్రామ పంచాయతీల్లో మూడింటికి ఏకగ్రీవం అయ్యింది. తిరుమలాయపాలెం (తిమ్మక్కపేట), కూసుమంచి (కొత్తూరు), నేలకొండపల్లి (ఆచర్లగూడెం), సర్పంచ్ పదవులకు ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో మిగిలిన 131 స్థానాలకు ఈ నెల 14న జరగబోయే రెండో విడత ఎన్నికల కోసం అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.