మంత్రి చొరవ.. తేలకంటి కోడానికి రేషన్ షాపు
NLG: కనగల్ మండలం తేలకంటి గూడెం ప్రజలకు మంత్రి వెంకట్ రెడ్డి చొరవతో గొప్ప ఊరట లభించింది. గ్రామంలో రేషన్ లేకపోవడంతో నిత్యవసరాల కోసం సుమారు 4కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దుస్థితిని మంత్రి పరిష్కరించారు. మంత్రి ప్రత్యేక చొరవతో నేడు గ్రామంలో నూతన రేషన్ దుకాణం ప్రారంభమైంది. దీంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకున్నారు.