టీకా కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: డీవో
JGL: కోరుట్ల మండలం అయిలాపూర్ PHC పరిధిలోని మోహనరావుపేట ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డా.నరేందర్ పరిశీలించారు. పిల్లలకు, గర్భిణులకు ఇస్తున్న టీకా కార్యక్రమాన్ని పరిశీలించి, పలు సూచనలు చేశారు. అనంతరం ఓపీ, ఫార్మసీ నిల్వ రిజిస్టర్లను తనిఖీ చేశారు.