పిడుగుపాటుకు మూడు గొర్రెలు మృతి

పిడుగుపాటుకు మూడు గొర్రెలు మృతి

SKLM: ఎచ్చెర్ల మండలం కొంగరాంలో సోమవారం సాయంత్రం పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుకు గ్రామానికి చెందిన పి. అసిరి వాడు అనే రైతుకు చెందిన మూడు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. సమీప పొలాల్లో గొర్రెలు మేత మేస్తుండగా అకస్మాత్తుగా పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు రూ.50 వేల ఆస్తి నష్టం వాటిల్లి నట్లు బాధితుడు తెలిపారు.