VIDEO: 'కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి'
JN: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో నేడు ఎమ్మెల్యే మాట్లాడుతూ... దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని, గత యాసంగిలో రైతులకు చెల్లించాల్సిన సన్న వడ్ల బోనస్ బకాయిలు ఎప్పటిలోగా ఇస్తారో స్పష్టంగా చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు.