అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ సహాయం
కృష్ణా: అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ సహాయం అభినందనీయం అని డీఆర్వో సీసీ తూము వెంకటేశ్వరరావు అన్నారు. చల్లపల్లి మండలం మంగళాపురంలో అగ్నిప్రమాద బాధితుడు కర్రా లక్ష్మయ్యకు శుక్రవారం రెడ్ క్రాస్ చల్లపల్లి ఛైర్మన్ లీలాబ్రహ్మేంద్ర స్టీల్ సామాన్లు, సరుకులు, టార్పాలిన్, రగ్గు, జిల్లా ఛైర్మన్ డాక్టర్ డీ.ఆర్.కే ప్రసాద్ ద్వారా రూ. 5వేలు ఆర్థిక సహాయం అందచేశారు.