గమ్య స్థానాన్ని చేరుకునేందుకు తరిగిన సమయం

NDL: ఇటీవల నాందేడ్ నుంచి నంద్యాల మీదుగా తిరుపతికి నూతన ప్రత్యేక రైలు ప్రారంభించారు. ప్రస్తుతం నంద్యాల నుంచి హైదరాబాద్‌కు అన్ని రైళ్లు 8 గంటలకు పైగా సమయం తీసుకుంటుండగా, ఈ ప్రత్యేక రైలు కేవలం 6 గంటల్లోనే గమ్య స్థానాన్ని చేరనుంది. రాత్రి 7:45కు నంద్యాల నుంచి బయలుదేరి, అర్ధరాత్రి 1:40కు హైదరాబాదు చేరుతుంది. వేగవంతమైన ఈ సేవ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది.