ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి

SKLM: ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న సైనిక చర్యలు వెంటనే ఆపాలని ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక డిమాండ్ చేసింది. పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనంలో గురువారం ఆపరేషన్ కగార్ ఆదివాసీలపై యుద్ధానికి వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.