చెత్తను డంప్ చేయడంతో తీవ్ర ఇబ్బందులు

చెత్తను డంప్ చేయడంతో తీవ్ర ఇబ్బందులు

EG: అయినవిల్లి మండలంలోని సిరిపల్లి గ్రామంలో పంట పొలాల మధ్య డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం రైతులు మాట్లాడుతూ.. డంపింగ్ కారణంగా పంట కాలువలు మూసుకుపోతున్నాయని, పందులు, కుక్కలు చేరి పరిసరాలను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.