చిన్నారులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ
NGKL: లింగాల మండలం రాయవరం గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ శ్రీను యాదవ్ చిన్నారులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. వేసవి కాలంలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా చిన్నారులు వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని, ఎండలు ఎక్కువగా ఉన్నందున్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.