అయ్యప్ప ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

అయ్యప్ప ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

కృష్ణా: గుడివాడ పట్టణంలోని శ్రీ స్వామి అయ్యప్ప దేవస్థానంలో జరగనున్న మకర జ్యోతి ఉత్సవాల ఆహ్వాన పత్రికలను అన్నదాన నిర్వహణ కమిటీ సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భగవంతుని ఆశీస్సులతో సర్వమాలదారులు తమ దీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు. ఉత్సవాల విజయవంతానికి ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా సహకరిస్తానని హామీ ఇచ్చారు.