సంఘాల బలోపేతంపై కలెక్టర్ దృష్టి
పార్వతీపురంలో నిర్వహించిన మెప్మా సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి మహిళా సంఘాల బలోపేతంపై దృష్టి సారించాలని సూచించారు. సభ్యత్వ నమోదు వేగవంతం చేసి లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. పరిశుభ్రతపై అవగాహన పెంచి, ఇంటి, వంట ముస్తాబుపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని సూచించారు.