మౌనిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
VSP: గాజువాకలో దారుణ హత్యకు గురైన మౌనిక మృతదేహం భాగాలను పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు. మంగళవారం మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మౌనిక తండ్రి, కుటుంబ సభ్యులు కేజీహెచ్ మార్చురీ వద్దకు చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అమలుకున్నాయి.