మైనర్పై అఘాయిత్యం.. యువకుడిపై కేసు నమోదు
WNP: గోపాల్పేట మండలంలోని ఓ గ్రామంలో మైనర్‌ను ప్రేమ పేరుతో నమ్మించి, లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసిన శ్రీహరి అనే యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ జగన్మోహన్ తెలిపిన వివరాలు ప్రకారం బాలికను ఏడాదిగా మాయమాటలతో లొంగ దీసుకున్న నిందితుడు, పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడన్నాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.