ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
సూర్యాపేట పట్టణంలోని జయా స్కూల్‌లో నిర్వహించిన 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో సీఐ వెంకట్ విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాద రహిత సమాజానికి సహకరించాలన్నారు. చిన్నతనం నుంచే నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సైలు సాయిరాం, శివతేజ, వెంకన్న, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.