పూడూరు నూతన తహసీల్దార్‌గా విజయ్ కుమార్ బాధ్యతలు

VKB: పూడూరు మండలం నూతన తహసీల్దార్‌గా బీ.విజయకుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన భరత్ గౌడ్ కలెక్టరేట్‌కు బదిలీ కావడంతో, ఆయన స్థానంలో కొడంగల్లో విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ నియమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.