పాలీసెట్ పరీక్షకు 94.89 శాతం హాజరైన విద్యార్థులు

పాలీసెట్ పరీక్షకు 94.89 శాతం హాజరైన విద్యార్థులు

SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో మంగళవారం పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది ఏడు పరీక్ష కేంద్రాల్లో కలిపి 2,136 విద్యార్థులు పరీక్ష రాయాల్సిఉండగా, 2,027 మంది హాజరు అయినట్లు జిల్లా కో ఆర్డినేటర్ తెలిపారు. బాలురు 894 మంది, బాలికలు 1,133 మంది కలిపి మొత్తం 2,027 మంది హాజరైనట్లు తెలిపారు. 94.89 శాతం హాజరు నమోదైనట్లు వెల్లడించారు.