నత్తనడకన చౌటుప్పల్‌ ఫ్లైఓవర్ పనులు

నత్తనడకన చౌటుప్పల్‌ ఫ్లైఓవర్ పనులు

BHNG: చౌటుప్పల్ పట్టణంలో కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శని, ఆదివారం వంటి సెలవు దినాల్లో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగి పట్టణం మొత్తం ట్రాఫిక్ సమస్యలతో స్తంభించిపోతోంది. పట్టణంలోని ప్రధాన మార్గాలు మూసివేతకు గురవ్వడం ఈ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది.