ప్లాస్టిక్ వాడకంపై రూ.81వేల జరిమానా

ప్లాస్టిక్ వాడకంపై రూ.81వేల జరిమానా

KMM: ఖమ్మం కస్బా బజార్, కమాన్ బజార్, అజీజ్ గల్లీ ప్రాంతాల్లో KMC అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్న, ఉపయోగిస్తున్న దుకాణదారులకు రూ.81,500 జరిమానా విధించారు. 70 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగాన్ని మానేసి, ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలన్నారు.