చెరువులోకి దూసుకెళ్లిన ఆటో.. ఒకరు మృతి
MDK: రోడ్డుపై వెళ్తున్న కోతిని తప్పించబోయి ప్రమాదవశాత్తు ఆటో చెరువులోకి దూసుకెళ్లి ఒకరు మృతి చెందారు. పెద్ద శంకరంపేట మండలం జమ్మికుంట గ్రామానికి చెందిన మామా, అల్లుడు జోగిపేట వైపు వెళ్తున్న క్రమంలో అన్న సాగర్ కట్టపై కోతిని తప్పించబోయి ఆటో చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మామ మృతి చెందగా అల్లుడు స్వల్ప గారితో బయటపడ్డారు.