INSPIRATION: లాలా లజపతి రాయ్
స్వాతంత్య్ర సమరయోధుడు లాలా లజపతి రాయ్ ధైర్యానికి నిలువుటద్దం. 'పంజాబ్ కేసరి'గా పిలవబడే ఆయన సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటంలో బ్రిటీష్ వారి లాఠీ దెబ్బలకు ఎదురొడ్డి నిలిచారు. 'నాపై పడే ప్రతి లాఠీ దెబ్బ బ్రిటీష్ సామ్రాజ్య శవపేటికకు ఒక్కో మేకు అవుతుంది' అన్న ఆయన మాటలు నేటికీ దేశభక్తిని రగిలిస్తాయి. స్వయంకృషి, త్యాగం, అచంచలమైన ధైర్యంతో ఆయన చూపిన మార్గం యువతకు నిరంతర స్ఫూర్తిదాయకం.