కేజీహెచ్‌ను సందర్శించిన మహిళా కమిషన్

VSP: జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన మజందర్ విశాఖపట్నంలోని కింగ్‌జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో ఉన్న సఖి వన్ స్టాప్ సెంటర్‌ను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రం అందిస్తున్న సేవల గురించి, బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆమె సిబ్బందికి సూచించారు.