VIDEO: నాఫ్తాలిన్ ట్యాంకర్ బోల్తా

కోనసీమ: ముమ్మిడివరంలో నాఫ్తాలిన్ ట్యాంకర్ బోల్తా పడింది. తాటిపాక ONGC ప్లాంట్ నుండి కలకత్తా వెళ్తున్న నాఫ్తాలిన్ ట్యాంకర్ ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని దొమ్మేటి వారిపాలెం రోడ్డు పక్కన గోతిలోకి బోల్తాపడింది. 35 వేల లీటర్లతో ఉన్న ఈ ట్యాంకర్‌లో అత్యంత ప్రమాదకరమైన పేలుడు లిక్విడ్ ఉండటంతో అధికారులు అప్రమత్తమై 100 మీటర్ల పరిధిలో ఖాళీ చేయించారు.