'వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి'
SKLM: వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. స్థానిక పాత బస్టాండ్ దగ్గర గజపతి హోటల్‌ను ఎమ్మెల్యే ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోటల్ పరిశుభ్రత, ప్రమాణాలను పాటించాలని హోటల్ యాజమాన్యానికి సూచించారు. కస్టమర్స్ మన్ననలు పొందే విధంగా హోటల్ నిర్వహణ ఉండాలని అన్నారు.