లారీ డ్రైవర్ల కోసం RO వాటర్ ప్లాంట్ ప్రారంభం

లారీ డ్రైవర్ల కోసం RO వాటర్ ప్లాంట్ ప్రారంభం

నంద్యాల జిల్లా కలెక్టర్ జీ. రాజకుమారి మంగళవారం పట్టణంలోని విజయ పాల డైరీ సమీపంలో నూతన RO వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు రూ.2.40 లక్షల వ్యయంతో, గంటకు 1000 లీటర్ల సామర్థ్యం గల ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. లారీ, ఆటో డ్రైవర్లకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు.