కాంగ్రెస్ కార్యాలయం వద్ద మైనారిటీ పట్టణ అధ్యక్షుడి నిరసన

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గల గాంధీ విగ్రహం ఎదుట పట్టణ మైనార్టీ అధ్యక్షుడు గౌస్ బైఠాయించి శనివారం నిరసన వ్యక్తం చేశారు. పట్టణ కాంగ్రెస్‌లో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నించినందుకు పట్టణ అధ్యక్షుడు మల్లయ్య తనపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. సొంత పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్న అతడిపై చర్యలు తీసుకోవాలన్నారు.