పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలపై సూచనలు

పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలపై సూచనలు

MBNR: పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని పాలమూరు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రవీణ తెలిపారు. ఇవాళ ప్రారంభమైన డిగ్రీ పరీక్షల సందర్భంగా ఆమె వివేకానంద డిగ్రీ కళాశాలలోని కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్వాహకులు నియమాలు పాటించాలని సూచించారు.