న్యాయం కోసం.. IAS అధికారి కాళ్లపై పడిన రైతు!

న్యాయం కోసం.. IAS అధికారి కాళ్లపై పడిన రైతు!

దేశానికి అన్నం పెట్టే రైతు ఒక IAS అధికారి కాళ్లపై పడి కన్నీరు పెట్టుకున్న హృదయ విదారక ఘటన UPలో జరిగింది. తన భూమిని విభజించేందుకు క్లర్క్ రూ.10 వేలు లంచం అడుగుతున్నాడని, న్యాయం చేయాలని IAS దీక్షా జోషిని ఆ రైతు వేడుకున్నాడు. న్యాయం చేయకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని దుఃఖించాడు. దీంతో ఆమె ఆ క్లర్క్‌పై విచారణకు ఆదేశించారు. త్వరలోనే భూ విభజన పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.