కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్‌షీట్
TG: తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. 23 నెలల పాలనలో ఏం చేశారని కాంగ్రెస్ నేతలు ఓట్లు అడుగుతున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. 111 జీఓ రద్దు వెనక రేవంత్ కుటుంబం రూ.లక్షల కోట్ల దోపిడీ చేసిందని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు.