VIDEO: కిరాణా జనరల్ స్టోర్‌లో చోరీ.!
MDK: మాసాయిపేట మండల కేంద్రంలో నరేష్ అనే వ్యక్తికి చెందిన మణికంఠ కిరణ జనరల్ స్టోర్‌లో గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు. శుక్రవారం రాత్రి దుకాణం షెట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు విలువైన సామాగ్రితో పాటు కొంత నగదును అపహరించినట్లు బాధితుడు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.