పెద్దపులి సంచారం .. భయాందోళనలో కార్మికులు

పెద్దపులి సంచారం .. భయాందోళనలో కార్మికులు

AP: ఉభయ గోదావరి జిల్లాలను బెంబేలెత్తిస్తున్న పెద్ద పులి తాజాగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోకి ప్రవేశించింది. ప్రాజెక్టు స్పిల్‌వే దిగువన గోదావరి ప్రవాహ ప్రాంతంలో పెద్దపులి ఆవుదూడపై దాడి చేసి చంపింది. ప్రాజెక్టు సమీపంలో పులి సంచరిస్తుండటంతో కార్మికులు భయాందోళనలకు గురవుతున్నారు. పులికి అమర్చిన ట్రాకర్‌ ద్వారా అది సంచరించిన ప్రాంతాల్ని అటవీ సిబ్బంది పరిశీలించారు.