హైకింగ్‌కు వెళ్తే రూ.2.87 కోట్ల నిధి

చెక్ రిపబ్లిక్‌లోని పోడ్కర్కోనోసి పర్వతాల్లో హైకింగ్ కు వెళ్లిన ఇద్దరు పర్యాటకులకు ఊహించని సంపద లభించింది. వారికి 598 బంగారు నాణేలు, ఆభరణాలు, పొగాకు సంచులు కనిపించాయి. 1808 కాలం నాటివని గుర్తించిన ఈ నిధి విలువ రూ.2.87 కోట్లు. 1921 తర్వాత ఎవరైనా దాచి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. సరదాగా వెళ్లిన హైకింగ్ లో ఈరకంగా అదృష్టం వరించింది.