' సరిపడా యూరియాను సరఫరా చేయాలి'

SDPT: రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. గజ్వేల్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట గురువారం ఆందోళన నిర్వహించారు. రైతులతో కలసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రోజు ఉదయం యూరియా కోసం రైతులు వచ్చి రాత్రి వరకు వేచి చూసినా యూరియా దొరకట్లేదన్నారు.