VIDEO: 'పదవికి మాత్రమే రాజీనామా'
VSP: జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం తన పదవికి మాత్రమే రాజీనామా చేశానని, జనసేన పార్టీకి మాత్రం కాదని స్పష్టం చేశారు. పర్యావరణ కేసుల కారణంగా పవన్ కళ్యాణ్‌కు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానన్నారు. సముద్ర జీవవైవిధ్యం దెబ్బతింటోందని, ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.