నేడు జరిగిన పరీక్షకు 190 మంది గైర్హాజరు
బాపట్ల జిల్లాలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, శనివారం జరిగిన పరీక్షలకు 190 మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జుబేర్ పేర్కొన్నారు. అయితే 1423 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 1233 మంది విద్యార్థులు మాత్రమే హజరయ్యారని తెలిపారు. నేడు జరిగిన పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా జరిగాయన్నారు.