హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు: మంత్రి
సత్యసాయి: ఓడీ చెరువు మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు మెరుగైన వైద్యమందించాలని మంత్రి సవిత ఆదేశించారు. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్‌తో ఆదివారం మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. హాస్టల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్డుకు పైగా రావడానికి కారణాలు తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.