ప్రభుత్వ భూమి ఆక్రమణ విచారణకు ఆదేశించిన ఛైర్‌పర్సన్
KMM: వైరా మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవ్వడంపై ఛైర్‌పర్సన్ చంద్రకళ సోమవారం విచారణకు ఆదేశించారు. ఓ స్పెషల్ డ్రైవ్ కార్మికుడు సుమారు 60చదరపు అడుగుల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టినట్లు వచ్చిన ఆరోపణలపై ఆమె స్పందించారు. దీనిపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.