నేడు పిచ్చాటూరులో విద్యుత్ సరఫరా బంద్
తిరుపతి: పిచ్చాటూరు మండలంలో శనివారం సబ్ స్టేషన్లలో మెయింటినెన్స్ పనులు చేపట్టనున్నట్లు విద్యుత్ ఏఈ సుబ్రహ్మణ్యం రెడ్డి తెలిపారు. పిచ్చాటూరు టౌన్ నందు ఉదయం 9:00గంటల నుంచి సాయంత్రం 4:00 PM గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. మిగిలిన గ్రామాల్లో ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు కరెంటు సప్లై ఉండదన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.