అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం
SRPT: అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. ఈరోజు కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 1 నుండి ఆన్‌లైన్ పాస్ విధానం అమలవుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత లేకుండా చూడాలని, నిఘా కోసం మొబైల్ టీంలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఉన్నారు.