ఆలయ భూముల లీజులు చెల్లించకపోతే చర్యలు

ఆలయ భూముల లీజులు చెల్లించకపోతే చర్యలు

అన్నమయ్య: రామసముద్రం మండలంలోని దేవాలయం భూముల లీజులను రైతులు సకాలంలో చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ హెచ్చరించారు. కాప్పల్లిలోని రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. చంద్రశేఖరస్వామి, జనార్ధనస్వామి, వాలీశ్వరస్వామి, దుర్గలమ్మ, బల్లసముద్రం వాలీశ్వరస్వామి ఆలయ భూముల లీజులు రైతులు చెల్లించకపోతే తిరిగి వేలం వేస్తామన్నారు.