విగ్రహ ధ్వంసం.. అభిమానుల ఆందోళన..!
AKP: జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అనకాపల్లి మండలం తగరంపూడిలోని మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై స్థానిక కాపు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిరసన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనపై విచారణ ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.