సాగునీటిని విడుదల చేసిన కోడుమూరు ఎమ్మెల్యే

KRNL: సి.బెళగల్ మండలం బ్రాహ్మణ దొడ్డిలో చెరువు నుంచి సాగునీటిని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గురువారం విడుదల చేశారు. చెరువు నుంచి సుమారు 100 ఎకరాలకు నీరు అందుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మండగిరి చంద్రశేఖర్, నాయకులు అమర్, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.