నేడు మంత్రి పర్యటన వివరాలు

నేడు మంత్రి పర్యటన వివరాలు

WG: పెనుమంట్ర మండలం మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థలో బుధవారం నిర్వహించనున్న 'సుస్థిర వరి వ్యవసాయం' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హాజరుకానున్నారు. రేపు ఉదయం 8 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి, 10:30 గంటలకు ఆయన మార్టేరు చేరుకుంటారు. ఈ సందర్భంగా వరి సాగులో ఆధునిక పద్ధతులు, సుస్థిర దిగుబడులపై మంత్రి రైతులతో మాట్లాడనున్నారు.