VIDEO: కొంగలవీడులో బనాన స్టెమ్ ఎక్స్‌ట్రాక్సన్ యూనిట్
ప్రకాశం: అరటి పంటలో వృధాగా పోయే కాండం, రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారుతోందని ఉద్యాన శాఖ అధికారి శ్వేత అన్నారు. గిద్దలూరు మండలం కొంగలవీడులో ఏర్పాటు చేసిన బనాన స్టెమ్ ఫైబర్ ఎక్స్‌ట్రాక్సన్ యూనిట్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక అరటి కాండం నుంచి 200-300 గ్రాముల ఫైబర్ లభిస్తుందని, ఒక టన్ను ఫైబర్‌కు సుమారు రూ.1,50,000 వరకు ధర లభిస్తుందన్నారు.