79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు: కలెక్టర్

NTR: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం, కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.