'ప్రజాపాలనలో అభివృద్ధి పరుగులు పెడుతోంది'

MBNR: ప్రజాపాలనలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్‌లో రూ.84 లక్షల నిధులతో డ్రైనేజీలు, బస్సు షెల్టర్, సీసీ రోడ్లు, అంగన్వాడి భవన నిర్మాణాలకు ఈరోజు ఎమ్మెల్యే భూమి పూజ చేసి మాట్లాడారు. అభివృద్ధికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తున్నామన్నారు.