VIDEO: వంతెన నిర్మాణంలో పడి బైకర్ మృతి
SKLM: రణస్థలం 16వ జాతీయ రహదారిపై వంతెన నిర్మాణ పనుల్లో తీసిన గుంతలో ఆదివారం ఉదయం ఓ వ్యక్తి మృతి చెందినట్లు జేఆర్ పురం ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. లావేరులోని వేణుగోపాలపురానికి చెందిన దుర్గాసి నర్సింనాయుడు బైకుపై వస్తూ ఎమ్మార్వో ఆఫీసు సమీపంలో గుంతలో పడి చనిపోయాడన్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.