భోజనం బాగాలేకపోతే కఠిన చర్యలు: లోకేష్
AP: మధ్యాహ్న భోజన పథకంపై ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్న భోజనం బాగాలేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీచర్లు రోజూ భోజన నాణ్యతను పరీక్షించాలని ఆదేశించారు. త్వరలోనే సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థ తీసుకొస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు వారానికో పాఠశాలను సందర్శించాలని సూచించారు. భోజనంపై లీప్ యాప్ ద్వారా అభిప్రాయాలు తెలియజేయవచ్చని చెప్పారు.